గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం మాచాయపాలెం గ్రామానికి చెందిన నరసింహయ్య జల్సాలకు అలవాటు పడి.. చోరీలు చేస్తున్నాడు. ఇదే క్రమంలో గత నెల 19న ఆళ్లగడ్డలోని టీబీ రోడ్డులో ఉన్న ఎరువుల దుకాణంలో దొంగతనం చేసి రెండు లక్షల రూపాయలను ఎత్తుకెళ్లాడు. ఆ చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. వాటి ఆధారంగా ఆళ్లగడ్డ ఎస్ఐ రామిరెడ్డి సిబ్బందితో కలిసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి బంధువులు, స్నేహితులను గుర్తించి వారి ద్వారా నిందితుడి ఆచూకీ కనుక్కున్నారు. మరోమారు దొంగతనం చేసేందుకు గుంటూరు నుంచి కడపకు వస్తున్నాడే సమాచారం అందుకొన్న పోలీసులు.. పోరుమామిళ్ల వద్ద అతడిని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతడి వద్ద నుంచి రెండు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నరసింహ గతంలో కంభం, దర్శి, కర్నూలులో చోరీలు చేసి అరెస్ట్ అయ్యాడని పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి...