తుంగభద్ర నదికి భారీగా వరద వస్తోంది. ఇప్పటికే కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం పూర్తిగా నిండిపోయింది. జలాశయం నుంచి 75 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. దీనివల్ల కర్నూలు జిల్లాలోని సుంకేశుల జలాశయం పూర్తిగా నిండిపోయింది.
సుంకేశులకు 75 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనివల్ల నదిలో ప్రవాహం ఈ సీజన్‌లో ఎప్పుడు లేనంతగా పెరిగింది. తుంగభద్ర నది నుంచి ప్రవాహం శ్రీశైలం జలాశయంలో కలుస్తుంది. ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి