ETV Bharat / state

ఇక్కడ చదువా.. వామ్మో అంటున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు - కర్నూల్​

అది ఓ ప్రభుత్వ పాఠశాల... పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. భవనం పైకప్పు పెచ్చులూడి.. ఎప్పుడు కూలిపోతుందో తెలియని దుస్థితి. ప్రమాదం పొంచి ఉన్న ఆ భవనంలోనే భయాందోళనతో ఉపాధ్యాయులు బోధన కొనసాగిస్తున్నారు. దానికితోడు బడి ప్రాంగణంలోని గ్రామ సచివాలయ భవనం కూడా నిరుపయోగంగా ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది.

పాఠశాల
పాఠశాల
author img

By

Published : Sep 2, 2021, 9:27 PM IST

శిథిలావస్థకు చేరిన ఓ పాఠశాల భవనం కర్నూలు జిల్లా నంద్యాలలోనిది. ఈ పాఠశాల భవనం పైకప్పు తరుచూ పెచ్చులుడుతూ పిల్లలను, ఉపాధ్యాయులను భయాందోళనకు గురి చేస్తోంది. ప్రమాదం పొంచి ఉన్న ఆ పాఠశాలలో అలానే తరగతులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది.

నంద్యాల క్రాంతినగర్​లో ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకుకు చేరుకుంది. పాఠశాల పైకప్పు పెచ్చులూడుతోంది. తరగతులు జరిగే క్రమంలో పిల్లలు, ఉపాధ్యాయులు భయపడుతున్నారు.

ఇక్కడ చదువా.. వామ్మో అంటున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు

2014 నుంచి ఇక్కడ పని చేస్తున్నాను. ఈ పాఠశాల గురించి సర్వశిక్షా అభియాన్​ వాళ్లు వచ్చి చూశారు. పాఠశాలను బాగు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఏమీ జరగలేదు. వర్షాకాలం వచ్చిందంటే పాఠశాల భవనం పెచ్చులు ఊడిపోతుంటాయి. ఈ కారణంగానే మా పాఠశాలలో పిల్లల్ని తల్లిదండ్రులు చేర్పించట్లేదు. -కామేశ్వరమ్మ, ఉపాధ్యాయురాలు, క్రాంతినగర్, నంద్యాల

2012 నుంచి ఈ పాఠశాలలో పని చేస్తున్నాను. అప్పటి నుంచి ఈ పాఠశాల పరిస్థితి ఇలాగే ఉంది. అధికారులు వస్తున్నారు..చూస్తున్నారు పోతున్నారు. కానీ పాఠశాలను పట్టించుకోవట్లేదు. ఇక్కడ పనిచేయాలంటేనే భయంగా ఉంది. -ఉమామహేశ్వరి, ప్రధానోపాధ్యాయురాలు, క్రాంతినగర్, నంద్యాల.

పాఠశాల పక్కనే ఇటీవలే గ్రామ సచివాలయ నూతన భవనం ఏర్పాటు చేశారు. నిరుపయోగంగా ఉన్న ఆ సచివాలయ భవనాన్ని తమకు అప్పజెప్పాలని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు. పాఠశాలలో వంటశాల సరిగలేదు. మరుగుదొడ్లు సక్రమంగా లేవని వాపోయారు.

ఇదీ చదవండి: తరగతిగది పెచ్చులూడి విద్యార్థికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.