ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ప్రధాన ద్వారాన్ని భక్తులు దర్శించుకునేందుకు తెరిచారు. మఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు గ్రామ దేవత మంచాలమ్మ, మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేసి ప్రధాన ద్వారాన్ని తెరిచి ఉంచారు.
పరీక్ష అనంతరమే అనుమతి..
మఠానికి వచ్చిన భక్తుల శరీర ఉష్ణోగ్రతను పరీక్షించి దర్శనానికి అనుమతిస్తున్నారు. మొదటి రోజు పలు ప్రాంతాల నుంచి దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.
ఇవీ చూడండి : సచివాలయ సిబ్బందిని చప్పట్లతో అభినందించండి: సీఎం జగన్