కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట వద్ద అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక నుంచి వస్తున్న రెండు స్కార్పియో వాహనాల్లో తనిఖీ నిర్వహించి, 6,240 టెట్రా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను సీజ్ చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామాల్లో కూడా మద్యం అక్రమ రవాణాపై గట్టి నిఘా పెంచామని అధికారులు తెలిపారు. చట్టవ్యతిరేకంగా నడుచుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: కర్నూలు జిల్లాలో కన్నుల పండువగా భోగి మంటలు