ETV Bharat / state

పదో తరగతి బాలిక అనుమానాస్పద మృతి.. ఎక్కడంటే! - గిరిజన విద్యార్థిని అనుమానాస్పద మృతి

Tenth Class Girl death in Mahabubnagar district: తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలంలో పదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి ఉద్రిక్తతకు దారితీసింది. పదోతరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని నిన్న రాత్రి ఒంటరిగా ఉండగా.. ముగ్గురు నిందితులు ఇంట్లోకి చొరబడి అత్యాచారం చేశారని, చేసిన ఘాతుకం బయటపడుతుందని హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

girl died
బాలిక మృతి
author img

By

Published : Dec 3, 2022, 5:26 PM IST

బాలిక మృతి

Tenth Class Girl death in Mahabubnagar district: తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలంలో బాలిక మృతి పట్ల ఆగ్రహానికి గురైన బంధువులు సమీప గ్రామంలో నిందితుల్లో ఒకరిగా భావిస్తున్న వ్యక్తి కారు, ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టారు. ఇంటిని ధ్వంసం చేశారు. బాలికకు న్యాయం చేయాలంటూ ఇంటి ముందు ధర్నాకు దిగారు. వరుసకు బాబాయి అయ్యే వ్యక్తి సహా ఇద్దరు ఈ ఘాతుకానికి ఒడి గట్టారని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.

వరుసకు బాబాయి అయినా.. గతంలో తనతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడని, నిత్యం తనపై, తన చెల్లెలిపై కన్నేసి ఉంచేవాడని బాలిక సోదరి చెప్పింది. అతనే తన చెల్లెల్ని చంపేశాడని కన్నీటి పర్యంతమైంది. బాలిక మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. జడ్చర్ల శాసనసభ్యులు లక్ష్మారెడ్డి బాధితురాలి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.

నిందితులెవరైనా.. చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాలిక కుటుంబాన్ని న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామని గ్రామస్థులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.