ETV Bharat / state

కర్నూలు, అనంతపురం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి వాహనాలను స్వాధీనం చేసుకోని రిమాండ్​కు తరలించారు.

పైపులో నుంచి మద్యం సీసాలను స్వాధీన చేసుకుంటున్న పోలీసులు

author img

By

Published : Feb 10, 2021, 1:59 PM IST

కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు పోలీస్​స్టేషన్ పరిధిలో తెలంగాణ మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గడివేముల మండలాలనికి చెందిన కొందరు వ్యక్తులు.. ఆటోలో పీవీసీ పైపులు తరలిస్తుండగా అల్లూరు వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడ్డారు. అనుమానం వచ్చిన పోలీసులు..పైపులో ఉన్న బట్టలను తొలగించి చూడగా వాటిలో మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. వాహనాన్ని పోలీస్​స్టేషన్ కు తరలించి పరిశీలించగా 26 పైపుల్లో 720 మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. వాహన చోదకుడు చెన్నయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో ఇద్దరు వ్యక్తులు పరారైనట్లు ఎస్సై తెలిపారు.

అనంతపురం జిల్లాలో....

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్ మండలం హవాలిగి వద్ద బైక్​పై తరలిస్తున్న 576 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకొని రిమాండ్​కు తరలించారు. వారి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో వైపు కేకాతి క్రాస్ వద్ద పల్లాలప్ప అనే వ్యక్తి ద్విచక్రవాహనంలో తరలిస్తున్న 212 మద్యం కర్ణాటక మద్యం ప్యాకెట్లను పట్టుకున్నారు. విడపనకల్లు చెక్​పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న 30 వేలు విలువ చేసే గుట్కా ను స్వాధీనం చేసుకున్నారు. బుక్కరాయసముద్రానికి చెందిన ఓ మహిళతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. డోనేకల్ చెక్​పోస్టు వద్ద చేసిన తనిఖీల్లో 66 వేల రూపాయలు విలువ చేసే తంబాకు స్వాధీనం చేసుకోగా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి

డోర్ డెలివరికి కేంద్రం నిధులివ్వదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.