కర్నూలు జిల్లా నంద్యాలలో విజయరాణి అనే ఉపాధ్యాయురాలు ధర్నాచేశారు. ఎస్పీజీ, సీఎస్ఐ ఎయిడెడ్ పాఠశాలల్లో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. అర్హత ఉన్నా పదోన్నతిలో పాఠశాల యాజమాన్యం తనకు అన్యాయం చేస్తోందని నిరసన తెలిపారు. నిరాధారమైన ఆరోపణలతో షోకాజ్ నోటీసులు ఇచ్చి మానసిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బిషప్ తనను సహోద్యోగుల ముందు బెదిరించి ప్రమోషన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. పదోన్నతితో పాటు నంద్యాలలో పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బహుజన టీచర్స్ ఫెడరేషన్ నాయకులు బాధితురాలికి మద్దతుగా నిలిచారు. విజయరాణికి న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి: పుష్కర స్నానాలకు తరలివస్తున్న భక్తులు