ETV Bharat / state

దారి తప్పిన "గురువు".. విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన! - విద్యార్థినుల ఉపాధ్యాయుడు పట్ల అసభ్యకర ప్రవర్తన

విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు "దారి తప్పాడు". వికృత చేష్టలతో విద్యార్థినులను వేధింపులకు గురిచేశాడు. ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ విద్యార్థినులు తమ తల్లిదండ్రుల వద్ద వాపోయారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకోగా.. సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన చేపట్టారు.

విద్యార్థినుల పట్ల అసభ్యకర ప్రవర్తన
విద్యార్థినుల పట్ల అసభ్యకర ప్రవర్తన
author img

By

Published : Apr 4, 2022, 8:22 PM IST

కర్నూలు జిల్లా కోసిగి మోడల్ స్కూల్​ సోషల్ టీచర్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్థులు వాపోయారు. ఉపాధ్యాయుడి తీరుపై పాఠశాల ప్రిన్సిపల్​కు ఫిర్యాదు చేసినా.. సరైన స్పందన లేదని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషయం తెలుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్​ చేస్తూ ఎస్​ఎఫ్​ఐ విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు.

ఈ విషయంపై మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సమీరా రెడ్డిని 'ఈటీవీ భారత్ ప్రతినిధి' ఫోన్ ద్వారా వివరణ కోరగా.. విద్యార్థినులు తనకు ఫిర్యాదు చేసిన రోజే ఆ ఉపాధ్యాయుడిని మందలించానన్నారు. సదరు ఉపాధ్యాయుడు సెలవుల్లో ఉన్నారని.., జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

ఇదీ చదవండి: అధికారంలోకి వచ్చాక.. జిల్లాలు సరిచేస్తాం : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.