కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘంలో తొమ్మిదో వార్డు కౌన్సిలర్ ఏకగ్రీవంపై వాగ్వివాదం జరిగింది. తమ పార్టీ అభ్యర్థి బి.హసీనా సంతకం ఫోర్జరీ చేసి.. నామినేషన్ ఉపసంహరించారని తెదేపా నాయకులు ఆరోపించారు.
గెలుపు కోసం వైకాపా నేతలు బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అభ్యర్థితో ఎన్నికల అధికారి ఫోన్లో మాట్లాడి అభిప్రాయం కనుక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. చివరికి అధికార పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి: