ETV Bharat / state

'రైతులను పరామర్శించేందుకు వారికి సమయం లేదు' - సోమిశెట్టి వెంకటేశ్వర్లు తాజా వార్తలు

వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శలు గుప్పించారు. వరదలతో నష్టపోయిన వారికి ఇంతవరకు పరిహారం ప్రకటించలేదన్నారు. వైకాపా నేతలకు అన్నదాతలను పరామర్శించేందుకూ సమయం లేదని ఎద్దేవా చేశారు.

somisetty venkateswarlu
సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తెదేపా నేత
author img

By

Published : Oct 19, 2020, 5:56 PM IST

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో రైతులు అతలాకుతలం అవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం నష్ట పరిహారం ప్రకటించకపోవడం దారుణమని.. తెదేపా కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నేతలకు రైతులను పరామర్శించడానికి కూడా సమయం లేదని ధ్వజమెత్తారు.

ఈ మధ్యనే కర్నూలు జిల్లాకు వచ్చిన ఒక మంత్రి ప్రజా సమస్యలను వదిలేసి తమ నాయకుడు చంద్రబాబును తిట్టేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారని విమర్శించారు. తుంగభద్ర పుష్కరాలకు ఎంతో సమయం లేదని.. ప్రభుత్వం ప్రారంభించిన పనులను పార్టీ తరపున పరిశీలిస్తామన్నారు.

ఇవీ చదవండి:

వర్షాలు తగ్గినా.. కష్టాలు తీరడం లేదు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.