కర్నూలు జిల్లా తుంగభద్ర నది ఆర్డీఎస్ కట్ట నుంచి జిల్లాలో రూ. 1980 కోట్లతో చేపట్టిన ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం కోసం తెదేపా, రైతులు ఏ త్యాగానికైనా సిద్దంగా ఉన్నారని మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జ్ పి. తిక్కారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో తాగు, సాగు నీటి కోసం కృష్ణా బోర్డు కేటాయించిన వాటా ప్రకారం 4 టీఎంసీల తుంగభద్రనది నీటిని వాడుకొనే హక్కు ఉందని..ఇప్పటికే జిల్లా వెనుకబడిన ప్రాంతం కావడంతో కాలువ ద్వారా నీటిని వాడుకోవచ్చని అన్నారు.
ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర నాయకులు అనవసర ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆనాడు తెలంగాణ కోసం ఎడమ కాలువ నిర్మించారని.. ఆ సమయంలో మా పెద్దలు కుడి కాలువ నిర్మించుకోలేదని గుర్తుచేశారు. తెదేపా హయాంలోనే వీటి టెండర్లు పూర్తయ్యాయని..ప్రస్తుత ప్రభుత్వం నిర్మాణం చేపట్టిందని అన్నారు. ఈ నిర్మాణం కోసం రాజకీయాలు చేయడం లేదని... కుడి కాలువ పనులు పూర్తిచేసేలా ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి. Water dispute: 'రాష్ట్రానికి కేటాయించిన నీటినే వాడుకోనున్నాం..'