ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో పుష్కర ఘాట్ల వద్ద నదిలో నీరు లేక భక్తులు స్నానం చేయలేని పరిస్థితి నెలకొందని.. తెదేపా సీనియర్ నాయకుడు తిక్కారెడ్డి అన్నారు. పుష్కరాల సందర్భంగా ఘాట్ వద్ద స్నానం చేశారు. పుష్కరాలు ప్రారంభమైనా.. ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు.
ఘాట్ వద్ద నదిలో మురుగు నీరు కలుస్తున్నందున భక్తులు స్నానం చేయలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ వస్తున్నారన్న కారణంతో.. నదిలోకి సుంకేసుల నీటిని విడుదల చేశారని.. పైన ఘాట్ల వద్ద నీరు లేక భక్తులు అవస్థలు పడుతున్నారని అన్నారు.
ఇవీ చదవండి: