ETV Bharat / state

SUICIDE: మహిళా ఇంజినీర్​ బలవన్మరణం...అసలేమైంది..! - పాదరసం

పెళ్లై కొన్ని నెలలే అయింది... దంపతులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే.. మంచి జీతం. కాపురం ఎక్కడ పెట్టాలనే విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. క్షణికావేశంలో భార్య పాదరసం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగింది.

పాదరసం తాగి మహిళా ఇంజినీర్​ ఆత్మహత్య..
పాదరసం తాగి మహిళా ఇంజినీర్​ ఆత్మహత్య..
author img

By

Published : Oct 24, 2021, 7:49 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని సిరాళ్లదొడ్డి విద్యుత్తు కేంద్రంలో ఇంజనీర్​గా పని చేస్తున్న సుష్మా(25) అనే వివాహిత పాదరసం తాగి ఆత్మహత్య చేసుకుంది.

ఏం జరిగింది..

సుష్మాకు కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని పులకుర్తి బ్యాంక్ మేనేజర్​గా పనిచేస్తున్న కిషోర్ కుమార్​తో ఈ ఏడాది మే నెల 30వ తేదీ వివాహం జరిగింది. అమ్మాయి తండ్రి తిమ్మప్ప విద్యుత్తు శాఖలో లైన్​మెన్​గా పని చేస్తున్నాడు. కుమార్తె కూడా అదే విద్యుత్​శాఖలో ఇంజనీర్​గా ఉద్యోగం చేస్తుండటంతో ఆనందపడ్డారు.

అయితే కిషోర్​ కుమార్​ కర్నూలులో కాపురం పెడదామంటే.. అందుకు సుష్మా అంగీకరించలేదు. ఎమ్మిగనూరులో కాపురం పెడదామని చెప్పింది. దాంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. క్షణికావేశంలో పాదరసం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తూ.. చిన్నపాటి వివాదానికే బలవన్మరణానికి పాల్పడటంతో తల్లిదండ్రులు, భర్త కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

Robbery in locked home : ఇంటికి కన్నం వేసి.. ఇల్లంతా కారం చల్లిపోయారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.