ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిరసిస్తూ రాష్ట్రంలో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించటం లేదని తెలుగుదేశం విమర్శించింది. జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరూ తమ ఆస్తులను కాపాడుకోవటానికే విశాఖ ఉక్కుపై నోరు మెదపటం లేదని వ్యాఖ్యానించింది. పార్టీ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విశాఖ ఉక్కును అమ్మేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్కు చెప్పే చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. వైకాపా, భాజపా, జనసేన లాలూచీ పడ్డాయని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఈ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
ఇవీ చదవండి: విషగుళికలు మింగి ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య