కర్నూలు జిల్లాలో రోజురోజుకీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని కలెక్టర్ వీర పాండియన్ వెల్లడించారు. అయినప్పటికీ ప్రజలు భయాందోళనకు గురికావొద్దని సూచించారు. కరోనా నిర్ధరణ పరీక్షలు అధికంగా చేస్తున్నందునే.. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందన్నారు. ఆసుపత్రుల్లోనూ అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. త్వరలోనే మరికొన్ని ఆసుపత్రుల్లో కొవిడ్ వైద్యం అందుతుందని స్పష్టం చేశారు.
ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్ల కొరత లేదని స్పష్టం చేశారు. మీడియాలో వస్తోన్న వార్తలు అవాస్తవమన్నారు. కరోనా వైరస్ సోకిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్సుల కొరత లేదని తెలిపారు. అవసరమైతే ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
ఇదీ చదవండి..