కర్నూలు జిల్లా అవుకు మండలం చెర్లోపల్లిలో ఇంటి స్థలాలను శ్మశాన వాటికలో కేటాయించారని లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. గ్రామ సచివాలయం వద్ద పెద్ద సంఖ్యలో చేరుకున్న మహిళలు శ్మశాన వాటికలో ఇళ్ల స్థలాలు వద్దని నిరసన వ్యక్తం చేశారు. ఇల్లు నిర్మించుకునేందుకు మంచి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు ఈ విషయాన్ని ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.
ఇది చదవండి రాష్ట్రంలో కొత్తగా 998 కరోనా కేసులు..14 మంది మృతి