కర్నూలు జిల్లా బేతంచర్లలోని కనుమ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి నాపరాళ్ల ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్న 106 సీసాల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఎవరైనా అక్రమ మద్యం రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇదీచదవండి.