తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో పుష్కర ఘాట్లో భక్తుల రాక పెరిగింది. భక్తులు పుష్కర స్నానాలు చేసి స్థానికంగా ఉన్న గురుసార్వభౌముడు రాఘవేంద్ర స్వామి మూల బృందావనంను దర్శించుకుంటున్నారు. రెండో రోజు వీవీఐపీ ఘాట్ వెలవెలబోతుండగా సంత మార్కెట్ ఘాట్లో మాత్రం భక్తుల సందడి కనిపిస్తోంది. ఘాట్ల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ జల్లు స్నానాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. కోస్తా ప్రాంతంతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు పుష్కర స్నానాలకు తరలి వస్తున్నారు.
ఇదీ చూడండి:
మంత్రాలయంలో భక్తుల సందడి.. ప్రత్యేక పూజలు - puskaralu at mantralayam
తుంగభద్ర పుష్కరాల నేపథ్యంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో భక్తుల రాక పెరిగింది. ఘాట్లో జల్లు స్నానాలు చేసి గురుసార్వభౌముడు రాఘవేంద్ర స్వామి మూల బృందావనంను దర్శించుకుంటున్నారు.