కర్నూలు జిల్లా ఆదోని పరిధిలో రెండు రోజుల క్రితం సంచలనం రేపిన 11 జింకల హత్య కేసులో రెండోరోజు విచారణ ముమ్మరంగా జరుగుతోంది. ఆంధ్ర, కర్ణాటక అటవీశాఖ అధికారులు.. ఘటనా స్థలానికి సమీపంలోని పొలాల రైతులతో మాట్లాడి వివరాలు సేకరీంచారు. ఈమేరకు గుంటూరు విజిలెన్సు కన్సర్వేటివ్ అధికారి గోపీనాథ్ నేతృత్వంలో విచారణ సాగుతోంది. ఈనేపథ్యంలో కర్ణాటకలోని వన్యప్రాణుల పాత నేరస్థులపై అరా తీశారు. ఆదోని పరిదిలో రెండురోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు దాదాపు 11 జింకలను హతమార్చారు.
ఆదోని డివిజన్ సరిహద్దు ప్రాంతంలో 30 వేల వరకు జింకలు ఉన్నాయని అటవీ అధికారి గోపీనాథ్ తెలిపారు. గతంలో స్థానికంగా జింకల పార్క్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. అలాగే ఈ కేసులో నిందితులపై వన్యప్రాణుల చట్టం కింద కేసు నమోదు చేస్తామన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని గుంటూరు విజిలెన్సు కన్సర్వేటివ్ అధికారి గోపీనాథ్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: