ETV Bharat / state

ముక్కిపోవాల్సిందే.. బియ్యం, కోడిగుడ్లు పాఠశాలల్లోనే నిల్వలు! - కరోనా కారణంగా బియ్యం, కోడిగుడ్లు పాఠశాలల్లోనే నిల్వలు వార్తలు

ప్రభుత్వ, జడ్పీ, ఆదర్శ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థులు భోజనం తింటున్నారు. 2020-21 విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. రెండు నెలలు బాగానే గడిచినా కరోనా కేసులు పెరిగిపోవడంతో విద్యాసంస్థలను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ముందుగానే వినియోగం కోసం సరఫరా చేసిన బియ్యం, కోడిగుడ్లు పాఠశాలల్లోనే నిల్వ ఉంచారు. వీటి కాలపరిమితి ముగిస్తే అవి ఎందుకు పనికిరాకుండా పోతాయి. ఫలితంగా రూ.లక్షల్లో నష్టం వాటిల్లుతుందని అధికారులు చెబుతున్నారు. పాఠశాలలో నిల్వ చేసిన బియ్యం, కోడిగుడ్లను కనీసం కొవిడ్‌ కేంద్రాలకైనా ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పాఠశాలలోనే బియ్యం, కోడిగుడ్లు నిల్వలు
పాఠశాలలోనే బియ్యం, కోడిగుడ్లు నిల్వలు
author img

By

Published : May 18, 2021, 7:07 AM IST

నంద్యాల ఎస్పీజీ ఎయిడెడ్‌ మోడల్‌ ప్రైమరీ పాఠశాలలో 91 మంది విద్యార్థులు చదువుతున్నారు. స్కూల్‌లో ప్రధానోపాధ్యాయుల భర్తీ విషయంలో యాజమాన్యం, సీనియర్‌ ఉపాధ్యాయుల మధ్య ఏప్రిల్‌ నుంచి వివాదం చోటుచేసుకుంది. అందులో పనిచేస్తున్న హెచ్‌ఎం పదవీ విరమణ పొందిన తర్వాత అక్కడే విధులు నిర్వహిస్తున్న సీనియర్‌కు కాకుండా జూనియర్‌కు హెచ్‌ఎం బాధ్యతలు అప్పగించడంతో విద్యాధికారులు జోక్యం చేసుకుని సరిదిద్దాలని ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఇదే పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి ప్రతి నెలా 3 టన్నుల బియ్యం, కోడిగుడ్లను గుత్తేదారులు స్కూల్‌ మూత వేయకముందే నిల్వ చేశారు. స్కూల్‌ హెచ్‌ఎం ఇకనైనా మేల్కోకుంటే నిత్యావసర సరకులు ముక్కిపోయే ప్రమాదముందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

విద్యార్థుల కడుపు నింపేందుకు తీసుకొచ్చిన నిత్యావసర సరకులు మగ్గిపోతున్నాయి. పాఠశాలలు నడుస్తున్న సమయంలో బియ్యం, కోడిగుడ్లు సరఫరా చేశారు. ఆ తర్వాత కరోనా కారణంగా విద్యాలయాలు మూతపడటంతో ప్రస్తుతం రోజుల తరబడి గదుల్లోనే ఉంచారు. సరఫరా చేసిన వాటిని కనీసం డ్రై రేషన్‌ కింద విద్యార్థులకు ఇచ్చినా ప్రయోజనం ఉండేది. అలా పంపిణీ చేయకపోవడంతో ఒక పక్క విద్యార్థులకు ఇవ్వక.. మరోవైపు ప్రభుత్వానికి అప్పగించకపోవడంతో సరకులు ముక్కిపోయి పనికిరాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది.

జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న 2,898 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 4.22 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలకు హాజరైన విద్యార్థులందరికీ భోజనం వడ్డించాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజన పథకాన్ని 86 శాతం మంది పిల్లలు సద్వినియోగం చేసుకుంటున్నారని విద్యాధికారులు చెబుతున్నారు. గతేడాది కరోనా విజృంభించడంతో విద్యాలయాలను మూసివేశారు.

ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొమ్మిది విడతలుగా విద్యార్థులకు డ్రై రేషన్‌ పంపిణీ చేశాయి. కానీ వీటిని సరిగా పంపిణీ చేయకపోవడంతో దుర్వాసన వస్తున్న గుడ్లను రహస్యంగా ముళ్లపొదల్లో పడేశారు. ఈ ఏడాది కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 1-9 తరగతులకు ఏప్రిల్‌ 20 నుంచి సెలవులు ప్రకటించింది. మరోవైపు పాఠశాలలకు అందించిన సరకులు ఎలా ఉన్నాయో ఎవరూ కన్నెత్తి చూడలేదు. ఇప్పటికే సరఫరా చేసిన బియ్యం, గుడ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

పర్యవేక్షణ ఎవరిది?

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనికిగాను ఒక్కో విద్యార్థిపై రోజుకు రూ.7కుపైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఖర్చు చేస్తున్నాయి. విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో కోడిగుడ్లను అందిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అందిస్తుండగా కోడిగుడ్లను గుత్తేదారుడు, మిగిలిన పప్పులు, నూనె, కూరగాయలు, ఇతర వస్తువులను వంట నిర్వాహకులే తెచ్చుకుంటారు. జిల్లాలో దాదాపు 951 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 28,78,351 కోడిగుడ్లను విద్యార్థులకు అందిస్తున్నారు. పాఠశాలల ప్రారంభ సమయంలో కరోనా కారణంగా చాలామంది పిల్లలు మధ్యాహ్న భోజనం మాత్రం తినేందుకు ఇష్టపడలేదు. మరికొందరు పాఠశాల పూర్తయ్యాక మధ్యాహ్నం ఇంటిబాట పడుతుండగా.. మిగిలినవారు ధైర్యం చేసి బడిలోనే భోజనం తీసుకున్నారు.

కుళ్లిపోయే ప్రమాదం

ప్రభుత్వ, జడ్పీ, ఆదర్శ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థులు భోజనం తింటున్నారు. 2020-21 విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. రెండు నెలలు బాగానే గడిచినా కరోనా కేసులు పెరిగిపోవడంతో విద్యాసంస్థలను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ముందుగానే వినియోగం కోసం సరఫరా చేసిన బియ్యం, కోడిగుడ్లు పాఠశాలల్లోనే నిల్వ ఉంచారు. వీటి కాలపరిమితి ముగిస్తే అవి ఎందుకు పనికిరాకుండా పోతాయి. ఫలితంగా రూ.లక్షల్లో నష్టం వాటిల్లుతుందని అధికారులు చెబుతున్నారు. పాఠశాలలో నిల్వ చేసిన బియ్యం, కోడిగుడ్లను కనీసం కొవిడ్‌ కేంద్రాలకైనా ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖాధికారి సాయిరాం ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ దీనిపై ప్రభుత్వం తగిన మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉందని, ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో పంపిణీ చేసేశామని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

ఆదోనిలో కఠినంగా లాక్​డౌన్ అమలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.