ETV Bharat / state

కష్టాల కడలిలో.. విజయ తీరం

ఓ పాఠశాల యజమాని జీవితాన్ని లాక్​డౌన్ మార్చేసింది. అంతా సవ్యంగా ఉంటుందన్న జీవితాన్ని తలకిందులు చేసేసింది. కుటుంబాన్ని నెట్టుకురావావంటే... పోరాటం చేయక తప్పదని అనుకున్నారు. వ్యవసాయంపై ఉన్న కొద్దిపాటి అవగాహనతో.. పొలాన్ని కౌలుకు తీసుకొని, సాగు ప్రారంభించి.. లాభాలు ఆర్జిస్తున్నారు.

school correspondent turned into farmer
రైతుగా మారిన పాఠశాల యజమాని
author img

By

Published : Jan 25, 2021, 12:51 PM IST

కరోనా కారణంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. కొద్దో గొప్పో కొలువుల్లో స్థిరపడిన వారు సైతం కింద పడిపోయారు. లాక్‌డౌన్​తో అందరి పరిస్థితులు తలకిందులైపోయాయి. ప్రత్యేకంగా విద్యారంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రైవేటు పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఓ పాఠశాల యజమాని.. కౌలు రైతుగా మారి, కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆత్మవిశ్వాసంతో బతుకు బండిని నడిపిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలిచారు.

పెద్దపెండేకల్‌ మహబూబ్‌పీరా బీకాం, బీఈడీ పూర్తి చేశారు. ఆదోనిలో ఆంగ్లమాధ్యమ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో పరిస్థితి తిరగబడింది. దీంతో బతుకు బండి గడవడం కష్టంగా మారింది. ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ధైర్యంగా ముందుకు కదిలారు. ఆదోని మండలం సాదాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఓ రైతు నుంచి రెండు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని, కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

ఎకరా పొలం రూ.6 వేల చొప్పున రెండు ఎకరాలకు రూ.12 వేలు కౌలు చెల్లించారు. రైతు కుటుంబం నుంచి రావటంతో వ్యవసాయంపై ఉన్న అనుభవంతో పత్తి సాగును ప్రారంభించారు. కుటుంబసభ్యులతో కలిసి రోజూ ఉదయం పొలానికి వెళ్లి పనులు చేయడం, సాయంత్రం ఇంటికి రావడంతో అలవాటు చేసుకున్నారు. ఇప్పటి వరకు 12 క్వింటాళ్ల పత్తి దిగుబడి తీయటంతో ఎకరాకు రూ.5 వేలు చొప్పున ఆదాయాన్ని గడించారు. కష్టానికి తగ్గట్టు దిగుబడి వస్తోంది. మరో మూడు, నాలుగు క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉంది.

కుంగిపోకుండా ధైర్యంగా ముందుకు...

పాఠశాలలు ప్రారంభం అయ్యే పరిస్థితి కన్పించకపోవడంతో ఆందోళనకు గురయ్యా. కుటుంబ పోషణకు ఏదో ఒక ఉపాధి వెత్తుకోవాల్సి వచ్చింది. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ధైర్యంగా ముందడుగు వేశా. కరోనా పరిస్థితులకు ఏమాత్రం భయపడకుండా కౌలుకు పొలాన్ని తీసుకుని కొత్త జీవితంతోకి అడుగు పెట్టా. ఒకప్పుడు పాఠశాల యజమానిగా.. ఉపాధ్యాయుడిగా బతికా. ఇప్పుడా పరిస్థితి లేదు. విద్యార్థులకు బోర్డుపై అక్షరాలు నేర్పిన నేనే పొలంలో బతుకు సేద్యం చేస్తున్నా. ప్రతి ఒక్కరూ పరిస్థితిని చూసి కుంగిపోకుండా.. ధైర్యంగా ముందుకు వెళ్లాలి. అప్పుడే విజయం సాధించవచ్చు. - మహబూబ్‌పీరా, పాఠశాల యజమాని

ఇదీ చదవండి:

ఇద్దరు దొంగలు అరెస్ట్.. 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.