కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ఫరూక్ సుబ్లీ డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే తక్షణం రాజీనామా చేయాలన్నారు. సలాం ఆత్మహత్యకు కారకులైన వారందరిని అరెస్టు చేయాలని కోరిన ఆయన.. సీఐ, హెడ్ కానిస్టేబుల్కు మంజూరైన బెయిల్పై అసహనం వ్యక్తం చేశారు.
ఉరవకొండలో కొవ్వొత్తుల ర్యాలీతో సంతాపం..
పోలీసుల వేధింపులు భరించలేక అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అనంతపురం జిల్లా ఉరవకొండ మైనార్టీ నాయకులు అన్నారు. ఆత్మహత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి సంతాపం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: