కర్నూలు మండలం పంచలింగాల సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టగా రూ.30 లక్షల నగదును ఎస్ఈబీ అధికారులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. నగర పాలక సంస్థ ఎన్నికల సందర్భంగా తనిఖీలు చేపట్టగా భారీగా నగదు పట్టుబడింది. అనంతపురం జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి చెందిన నాగరాజు కారులో హైదరబాద్ నుంచి వస్తుండగా ఆపి తనిఖీ చేశారు. మొదట రూ.5 లక్షలు దొరికాయి. నిశితంగా తనిఖీ చేయటంతో మరో 25 లక్షలను పోలీసులు గుర్తించారు. తాను న్వాయవాదినని స్థలం కొనుగోలు కోసం డబ్బు తీసుకువెళ్తున్నట్లు పోలీసులకు తెలిపాడు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారపత్రాలు చూపకపోవటంతో కారు, నగదును పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన నగదును ఎస్ఈబీ సీఐ లక్ష్మీదుర్గయ్య.. ఎన్నికల అధికారులకు అప్పగించారు.
ఇదీ చదవండి: