చికాగోలో భారతదేశం ఔన్నత్యాన్ని స్వామి వివేకానంద చాటిచెప్పి నేటికీ 128 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కర్నూలులో భాజపా ఆధ్వర్యంలో 'రన్ ఫర్ యువ' కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని నంద్యాల చెక్పోస్ట్ నుండి సీ క్యాంపు వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ పరుగులో బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బీజేవైయం రాష్ట్ర నాయకురాలు బైరెడ్డి శబరి పాల్గొన్నారు.
యువత స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని బైరెడ్డి రాజశేఖరరెడ్డి కోరారు.
ఇదీ చదవండి: 'దివ్యాంగుల పింఛన్లు తొలగించడం బాధాకరం'