ETV Bharat / state

TSRTC ప్రయాణికులకు గుడ్​న్యూస్.. పండక్కి ఊరెళ్లేవారికి బంపర్ ఆఫర్స్​! - ఏపీ తాజా వార్తలు

TSRTC Special Buses for Sankranti: తెలంగాణలో సంక్రాంతికి బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని, సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక సర్వీస్‌లు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. ప్రైవేట్‌ వాహనాల్లో అదనపు ఛార్జీలు చెల్లించి, ప్రమాదకర ప్రయాణం చేయొద్దని ప్రజలకు సూచించారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారు తిరుగు ప్రయాణానికి సైతం ముందే టికెట్‌ బుక్‌ చేసుకుంటే 10 శాతం రాయితీ అందిస్తున్నట్లు సజ్జనార్‌ వివరించారు.

TSRTC Special Buses
TSRTC Special Buses
author img

By

Published : Jan 6, 2023, 8:17 PM IST

TSRTC Special Buses for Sankranti: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంక్రాంతి ఎంతో కీలకమని, అందుకు అధికారులంతా పూర్తిగా సన్నద్ధంకావాలని ఆ సంస్థ ఎండీ సజ్జనార్​ సూచించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రద్దీ ప్రాంతాల్లో డిపో మేనేజర్‌, ఆపై అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాటుపై నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్ణణాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీస్‌లను నడిపేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. రద్దీకి అనుగుణంగా సర్వీస్‌లు పెంచాలని ఆదేశించారు. హైదరాబాద్‌ ఎమ్​జీబీఎస్​లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. సంక్రాతికి రానుపోనూ ఒకేసారి ఆర్టీసీ బస్సులో, టికెట్‌ బుక్‌ చేసుకున్న వారికి తిరుగుప్రయాణంపై 10 శాతం రాయితీని కల్పిస్తున్నామని, ప్రజలు రాయితీని వినియోగించుకోవాలని సజ్జనార్‌ సూచించారు.

TSRTC ప్రయాణికులకు గుడ్​న్యూస్.. పండక్కి ఊరెళ్లేవారికి బంపర్ ఆఫర్స్​!

ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతికి అడ్వాన్స్‌డ్‌ టికెట్ బుకింగ్‌ను 30 నుంచి 60 రోజులకు పెంచినట్లు వివరించారు. ఈ జూన్ వరకు ఆ సదుపాయం ఉంటుందని చెప్పారు. సంక్రాంతికి 4,233 ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు తెలిపిన సజ్జనార్‌ అందులో 585 సర్వీస్‌లకు ముందస్తు రిజర్వేషన్ కల్పించినట్లు పేర్కొన్నారు. ఈనెల 7 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతామని వివరించారు. పండగ రద్దీ దృష్ట్యా హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు సజ్దనార్‌ వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.