కర్నూలు జిల్లా గూడూరు మండలం చనుగొండ్ల గ్రామంలో రూ.లక్ష విలువైన నగలు చోరీకి గురయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలోని ఎర్రబావిగడ్డవాసులైన దేవేంద్ర, జయమ్మకు చెందిన నగలు గతనెల 27న ఇంట్లోనే చోరీకి గురయ్యాయి. బంగారం ఉంగరం, కమ్మలు, 22 తులాల వెండి ఆభరణాలు, రూ.12100 నగదు కనిపించకుండా పోయాయి.
ఈనెల 2న చోరీ విషయం గుర్తించిన బాధితులు కుటంబ సభ్యులు, ఇరుగుపొరుగువారిని విచారించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. శనివారం పీఎస్సై మమత, సిబ్బంది వచ్చి గృహాన్ని పరిశీలించి బాధితులను విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీఎస్సై తెలిపారు.
ఇదీ చదవండి