కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో భారీ చోరీ జరిగింది. కొండపేటలోని రాజశేఖర రెడ్డి ఇంటో దొంగలు చోరికి పాల్పడ్డారు. కుటుంబసభ్యులతో కలిసి రాజశేఖర రెడ్డి నిన్న సాయంత్రం కర్నూలు వెళ్లారు. ఉదయం వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లో దొంగలు పడ్డారని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 70 తులాల బంగారం, 3 కిలోల వెండి, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు తెలిపారు.
ఇదీ చదవండి: కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. వైర్లు తెగిపడి ఇద్దరు మృతి