కర్నూలులోని పోలీసు మైదానంలో 71వ గణతంత్ర వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ జి.వీరపాండియన్ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబసభ్యులను సత్కరించారు. వివిధ దళాల విన్యాసాలు ఆహుతులను ఆద్యంతం ఆకట్టుకున్నాయి. చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కోడుమూరులో
కర్నూలు జిల్లా కోడుమూరులో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యార్థులు, సిబ్బంది ముస్తాబు చేశారు. రంగురంగుల తోరణాలతో, రంగవల్లులతో అలంకరించారు. పోలీస్ స్టేషన్లో సీఐ పార్థసారథి రెడ్డి, మండల పరిషత్ కార్యాలయంలో, కోడుమూరు మేజర్ గ్రామ పంచాయతీలో ఎంపీడీవో మంజులవాణి, కొండపేట ప్రాథమిక పాఠశాలలో ఎంఈవో అనంతయ్య, రహదారులు, భవనాల శాఖ కార్యాలయంలో డీఈఈ నాగరాజు, మండలంలోని విద్యాసంస్థల్లో ప్రధానోపాధ్యాయులు జెండాను ఎగురవేశారు.
నంద్యాలలో
71వ గణతంత్ర దినోత్సవాన్ని కర్నూలు జిల్లా నంద్యాలలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో జరిగిన వేడుకల్లో... నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఇదీ చూడండి: ముగిసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధనా సిబ్బంది రాష్ట్ర స్థాయి క్రీడలు