ETV Bharat / state

నిరుపయోగంగా ఉన్న స్థలం.. అభివృద్ధికి కర్నూలు నగరపాలక సంస్థ నిర్ణయం

author img

By

Published : Feb 28, 2022, 9:41 AM IST

Recycling of waste management: అది ఒకప్పుడు కర్నూలు నగరానికి డంప్ యార్డు..! పేరుకుపోయిన టన్నుల కొద్దీ చెత్త..! ఫలితంగా ఎంతో విలువైన ఈ స్థలం నిరుపయోగంగా మారిపోయింది. దీనిని అభివృద్ధి చేసేందుకు కర్నూలు నగరపాలక సంస్థ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Recycling of waste management in kurnool dump yard
బయో రిమిడియేషన్ ద్వారా కర్నూలు డంప్​ యార్డ్​లో చెత్త రీసైక్లింగ్‌

Recycling of waste management: కర్నూలు నగరంలోని జోహరాపురం ప్రాంతంలో గతంలో డంప్ యార్డు ఉండేది. సుమారు 30 ఎకరాల్లో చెత్తను డంప్ చేసేవారు. నగరం రోజురోజుకూ విస్తరిస్తుండటం, చెత్త, వ్యర్థాలు ఎక్కువ అవుతుండటంతో.. ఈ డంప్ యార్డును గార్గేయపురం ప్రాంతానికి మార్చారు. అప్పటినుంచి ఈ స్థలం నిరూపయోగంగా ఉండటంతో... అభివృద్ధి చేయాలని కర్నూలు నగరపాలక సంస్థ నిర్ణయించింది. అందులో భాగంగా.. మొదటి విడతలో సుమారు 16 ఎకరాల్లో.. చెత్తను బయో మైనింగ్- బయో రిమిడియేషన్ చేయనున్నారు. అంటే ఈ చెత్తను శాస్త్రీయ పద్ధతిలో రీసైకిల్ చేయనున్నారు. దీని ద్వారా విశాలమైన స్థలం అందుబాటులోకి రానుంది.

స్వచ్ఛ భారత్- స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా.. నగరంలో 204 చెత్త దిబ్బలను ఇప్పటికే తొలగించినట్లు అధికారులు తెలిపారు. అతి పెద్ద చెత్తదిబ్బను తొలగించేందుకు కోటీ 60 లక్షల రూపాయల నిధులు కేటాయించారు. ఏడాదిలోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేలా ప్రణాళికలు రచించి గుత్తేదారులకు అప్పగించారు. ఈ స్థలంలో ఔట్ డోర్ స్టేడియం నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కర్నూలులో ఔట్ డోర్ స్టేడియం ఉంది. మరో స్టేడియాన్ని నిర్మిస్తే.. క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

భీమ్లా నాయక్‌ సినిమాపై రాజకీయాలు తగవు: వైకాపా ఎమ్మెల్యే రోజా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.