కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటి ఆలయంలో.. ఉమామహేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పూజలు నిర్వహించిన అనంతరం.. రథం ముందుకు లాగి ఉత్సవం ప్రారంభించారు. ఈ నెల 10 న ప్రారంభమైన మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. వేదపండితుల మధ్య సంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమం జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోలాటం మధ్య.. అలంకరించిన రథంలో ఉత్సవ విగ్రహాలకు భక్తులు పూజలు చేశారు.
డోన్‌లోని కొత్తబుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో.. పార్వతీ పరమేశ్వర రథోత్సవం, తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సుందర దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శివుడికి మూడు రోజులుగా ఆలయంలో పూజలు, అభిషేకాలు, జాగరణ, కళ్యాణం నిర్వహించారు.
పెద్దకడబూరులోని శ్రీసిద్ధారూఢ స్వామి మహా రథోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు పూర్ణ కుంభంతో ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథంపైనున్న ఉత్సవ మూర్తికి కొబ్బరికాయ కొట్టేందుకు రెండు వర్గాలు తోసుకోగా.. పోలీసులు చెదరగొట్టారు. ఉత్సవం తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఇదీ చదవండి: