ETV Bharat / state

'వ్యవసాయ పరిశోధన కేంద్రం స్థలంలో వైద్య కళాశాల వద్దు' - కర్నూలు జిల్లా వార్తలు

ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములకు ఆ ప్రాంతంలో కొదవే లేదు. అయినా.. సారవంతమైన భూముల్లోనే వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పట్టణానికి దూరమైనా సరే.. పట్టుబట్టి అక్కడే నిర్మించాలనుకుంటున్నారు. ఈ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల ఉన్న తమ భూములకు దశ తిరుగుతుందని... కొందరు బడాబాబులు చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

rars land issue in Kurnool district
rars land issue in Kurnool district
author img

By

Published : Dec 12, 2020, 10:15 AM IST

వ్యవసాయ పరిశోధన కేంద్రం స్థలంలో వైద్యకళాశాల ఏర్పాటుపై వెల్లువెత్తిన వ్యతిరేకత

రాయలసీమ రైతులకు కర్నూలు జిల్లా నంద్యాల పరిశోధన కేంద్రం ఆయువుపట్టు లాంటిది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ నుంచి ప్రతి ఏటా 25 కోట్ల రూపాయలకుపైగా నిధులు అందుతాయి. ఐసీఆర్ కింద రాష్ట్రంలోనే 7 అత్యధిక పథకాలు ఇక్కడే అమలవుతున్నాయి. ఈ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో 105 ఎకరాల భూమి ఉంది. ఇందులో పది ఎకరాల్లో రోడ్లు, భవన నిర్మాణాలు ఉన్నాయి. మిగిలిన 95 ఎకరాల్లో పత్తి, శనగ, మొక్కజొన్న, వరి, జొన్న, చిరుధాన్యాల పంటలు సాగవుతున్నాయి. ఈ పరిశోధన కేంద్రం, రైతు శిక్షణా కేంద్రంతో కలిపి 50 ఎకరాలు వైద్య కళాశాలకు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

నివేదిక బేఖాతరు

ఒక ప్రభుత్వ సంస్థ భూములు మరొక ప్రభుత్వ సంస్థకు కేటాయించాలంటే జీవో నంబర్‌ 571 ప్రకారం పరిశోధనా స్థానం అధిపతి అనుమతి పొందాలి. కానీ అలాంటిదేమి లేకుండానే భూముల కేటాయింపు జరిగింది. ఈ భూములపై సర్వే నెంబర్‌లతో రెండున్నర నెలల కిందట పరిశోధన కేంద్రానికి నోటీసులిచ్చారు. 15రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరగా... పూర్తి వివరాలతో..పంట భూములు కేటాయింపునకు అభ్యంతరం తెలుపుతూ..వారం రోజుల్లోనే RARS అధికారులు నివేదిక పంపారు. అయినా నేతల ఒత్తిళ్లతో ఆ నివేదికను బేఖాతరు చేశారు.

శతాబ్దానికి పైగా చరిత్ర

నంద్యాల పరిశోధన కేంద్రం.. 114 సంవత్సరాలుగా పరిశోధనలతో కొత్త వంగడాల సృష్టించి నంద్యాలకు విశేషమైన గుర్తింపు తెచ్చింది. అంతే కాకుండా దేశంలోనే ఆర్​ఏఆర్​ఎస్-ఏ1 గ్రేడ్‌గా మూడవ స్థానంలో నిలిచింది. పత్తిలో ఆరు రకాలు, పప్పు శనగలో 7 రకాల నూతన వంగడాలను ఈ కేంద్రం నుంచే సృష్టించారు. వరిలో ఎన్డీఎల్​ఆర్-7, 8 వంటి రెండు రకాలు, పొగాకులో మరొక రెండు రకాలు విడుదల చేశారు. మొక్కజొన్నలో 7 రకాలు వృద్ధి చేయగా.. ఎన్టీకే -5 తెల్లజొన్నలు, ఎన్-15 పచ్చరకాలు ప్రాచుర్యం పొందాయి. పొద్దుతిరుగుడులో3, కొర్రల్లో 5 రకాలు ఇక్కడి నుంచి బీజం వేసుకున్నాయి.

న్యూ దిల్లీలో భారతీయ పరిశోధన సంస్థ..నగరం మధ్యలో వెయ్యి ఎకరాల్లో ఉన్నా.. ఎప్పుడూ నిర్వీర్యం చేయాలని అనుకోలేదని రైతులు చెబుతున్నారు. కానీ నంద్యాలలోనే ఎందుకు పరిశోధనా కేంద్రాన్ని ఇలా చేస్తున్నారంటూ.. నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకుంటే.. దిల్లీ తరహాలో ఉద్యమిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి.

ఇదీ చదవండి:

రెప్పపాటులో ఘోర దుర్ఘటనలు.... రాష్ట్రంలో మూడేళ్లలో 563 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.