కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని రామ్ కో సిమెంటు పరిశ్రమలో పని చేస్తున్న వలస కార్మికులు ఆందోళనకు దిగారు. తమను సొంత రాష్ట్రాలకు పంపాలని డిమాండ్ చేశారు. కంపెనీలో పాత టైర్లు తగలబెట్టారు.
కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్ కు చెందిన సుమారు 2 వేల మంది కార్మికులు ఇక్కడ పని చేస్తున్నారు. లాక్డౌన్ లో చిక్కుకున్న వలస కూలీలను స్వగ్రామాలకు ప్రభుత్వం తరలిస్తున్నట్టే.. తమను కూడా పంపాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: