రెండు నెలల క్రితం కర్నూలు జిల్లాకు చెందిన వలస కూలీలు పని కోసం గుంటూరు జిల్లాకు వెళ్లి లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరుకు చెందిన 60 మంది వలస కూలీలు మిరపకాయలు కోసేందుకు గుంటూరు జిల్లాకు వెళ్లారు. లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో వాళ్లు అక్కడినుంచి సొంత ఊరికి కాలినడకన బయలుదేరారు. గుంటూరు నుంచి కోటప్పకొండ చేరగా విషయం తెలుసుకున్న పోలీసులు వారిని తిరిగి గుంటూరుకు తరలించారు. దీంతో తమను ఎలాగైనా స్వగ్రామానికి చేర్చాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: అంతకంతకూ వైరస్ వ్యాప్తి.. అసలా జిల్లాకు ఏమైంది?