ETV Bharat / state

'ప్రైవేటు ఉపాధ్యాయులకు ఆర్నెల్ల పాటు పది వేల చొప్పున ఇవ్వాలి' - adhoni news

ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు 6 నెలల పాటు పది వేల రూపాయలు సహాయం చేయాలని ప్రైవేటు ఉపాధ్యాయుల ప్రతినిధులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలో ప్రైవేటు పాఠశాలల కరెస్పాండెంట్ సమావేశం నిర్వహించారు. ​సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి... న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

private school meeting in karnool district
ప్రైవేటు పాఠశాలల కరెస్పాండెంట్ సమావేశం
author img

By

Published : Jan 10, 2021, 12:12 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో జిల్లా స్థాయి ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు, స్థానిక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. కరోనా వల్ల పాఠశాలలు మూతబడినా... ప్రైవేట్ టీచర్లను ఆదుకోకుండా... రోజూ పాఠశాలలు తనిఖీలు చేసి వేధిస్తున్నారని ప్రైవేటు పాఠశాలల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

కార్పొరేట్ పాఠశాలలను దృష్టిలో ఉంచుకొని తమను వేధించడం సరికాదన్నారు. రాష్ట్రంలో 48 శాతం విద్యార్థులు ప్రైవేట్ స్కూలులో చదువుతున్నారని చెప్పారు. కరోనా సమయంలో ముఖ్యమంత్రి జగన్ చాలా మందికి మేలు చేశారని.. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు సైతం 6 నెలల పాటు 10 వేల రూపాయలు సహాయం చేయాలని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

భార్గవరామ్‌ ఎక్కడ?: బెంగళూరు, పుణెలకు పోలీసు బృందాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.