ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా పొట్టి శ్రీరాములు జయంతి - potisriramulu birthday celebrations in whole state

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అన్ని జిల్లాల కలెక్టర్లు, రాజకీయ ప్రముఖులు అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

రాష్ట్ర  వ్యాప్తంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

author img

By

Published : Mar 16, 2020, 6:33 PM IST

రాష్ట్రవ్యాప్తంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల దేవి, తెదేపా నాయకులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కృష్ణా జిల్లా విజయవాడలో ఆంధ్ర రత్న పార్క్ వద్ద వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం వల్లే రాష్ట్ర సాధన సాధ్యమైందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి అన్నారు.

ఆంధ్రరాష్ట్రం కోసం 58 రోజులు నిరాహారదీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని విజయనగరం జిల్లా కలెక్టరేట్​ సమావేశ భవనంలో ఘనంగా జరిపారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ డా. హరి జవహర్​లాల్ పాల్గొన్నారు.

పొట్టి శ్రీరాములు జయంతిని కర్నూల్​లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని చిల్డ్రన్ పార్క్​లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా జాయింట్ కలెక్టర్ రవి పట్టన్​శెట్టి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తెలుగు ప్రజలు ఒక రాష్ట్రంగా ఉండాలని 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించిన ఘనత పొట్టి శ్రీరాములుకే దక్కుతుందని జాయింట్ కలెక్టర్ అన్నారు.

ఇదీ చూడండి:

ట్విట్టర్ ట్రెండింగ్​లో #బ్లీచింగ్ పౌడర్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.