కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని అందజేశారు.
ఆదోని
ఆదోనిలో పురపాలక ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు. 42 వార్డులకు తొమ్మిది వార్డులు ఏకగ్రీవం కాగా... మిగతా 33 వార్డులకు 115 కేంద్రాలలో పోలింగ్ జరుగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఆర్డీఓ రామకృష్ణ రెడ్డి తెలిపారు. ఏమైనా సమస్యలు వస్తే సహాయ ఎన్నికల అధికారి ఆర్జీవి కృష్ణకు ఫిర్యాదు చేయాలన్నారు.
ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరు మున్సిపల్ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రి అందజేసి పోలింగ్ కేంద్రాలకు వాహనాలలో తరలించారు. మొత్తం 459 మంది సిబ్బంది నియమించారు.
ఇదీ చదవండి: ఓటింగ్ శాతం పెంచేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు