కర్నూలు నగర శివారులోని జగన్నాథగట్టు ప్రాంతంలో పేదలకిచ్చేందుకు 10 వేల ఇళ్లను నిర్మిస్తున్నారు. తెదేపా హయాంలో లోగడ ఇక్కడే నిర్మించిన ఇళ్లకు లేత పసుపు వర్ణం ఉంది. వైకాపా హయాంలో ప్రస్తుతం నిర్మాణం తుది దశలో ఉన్న ఇళ్లకు ముదురు నీలం, తెలుపు రంగులు వేస్తున్నారు.
ఇలా ఒకే ప్రాంగణంలో వేర్వేరు రంగులతో నివాస సముదాయాలు కనిపిస్తున్నాయి. మొదటి విడతగా ఐదువేల మంది లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించారు. డిసెంబరు25 నాటికే వీటిని అందించాల్సి ఉన్నా, పనులు పూర్తికాలేదు. ప్రజాప్రతినిధుల సూచనలతో గుత్తేదారులు రంగులు వేస్తారని, ఇందులో తమ ప్రమేయం లేదని ఓ అధికారి వివరించారు.
ఇదీ చదవండి:
'న్యాయమూర్తుల బదిలీలతో ఆయనపై కేసుల విచారణలో జాప్యం జరగొచ్చు'