తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సెబ్ అధికారులు సీజ్ చేశారు. కర్నూలు సరిహద్దు పంచలింగాల వద్ద చేపట్టిన తనిఖీల్లో లారీకి కింద భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన బాక్సుల్లో మద్యం రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మద్యాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను సెబ్ సీఐ రవిచంద్ర అరెస్ట్ చేశారు. రెండు లారీలను, 400 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి. ఆనందయ్య కరోనా మందు పనితీరుపై.. పరిశోధన ప్రారంభం