కర్నూలు జిల్లా కోవెలకుంట్ల సమీపంలో సుమారు రూ.60 లక్షలు విలువైన గుట్కా ప్యాకెట్లను ఎస్ఈబీ పోలీసులు పట్టుకున్నారు. బళ్లారి నుంచి లారీలో కోవెలకుంట్లకు అక్రమంగా తరలిస్తుండగా సరకు స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేసి.. ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిగా భావిస్తోన్న కోవెలకుంట్లకు చెందిన మనోహర్ కోసం గాలిస్తున్నారు. అక్రమ రవాణాపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇదీ చూడండి..