కర్నూలు జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడి ఇరవై కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మల్లె శ్రీనివాసులు అతని స్నేహితుడు రఫి కలిసి కడప,కర్నూలు జిల్లాల్లో పలు దొంగతనాలకు పాల్పాడ్డారని కర్నూలు డీఎస్పీ మహేష్ తెలిపారు. కర్నూలు జిల్లాలో ఉలిందకొండ, గోనెగండ్ల, కోడుమూరు, కే.నాగులాపురం, ఓర్వకల్లు, సీ.బెళగల్, గూడూరు పోలీస్ స్టేషన్లలో వీరిపై కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. తాజాగా శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్ చేయగా.. రఫీ పరారీలో ఉన్నాడని, త్వరలో అతనిని అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. వీరి నుంచి బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
మరో కేసులో కర్నూలు బంగారుపేటలో ఈనెల 18వ తేదీ ఓ ఇంట్లో జరిగిన దొంగతనంలో మక్సుద్ అనే ముద్దాయిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 6 తులాల బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండీ.. ఆదోని సబ్ జైలుకు బీసీ జనార్దన్ రెడ్డి