కర్నూలు జిల్లా నందవరం మండలంలోని ఇబ్రహీంపురంలో మద్యం విక్రయాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 192 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బోయ చిన్న నరసింహులును అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ మహేష్ కుమార్ తెలిపారు. గ్రామాల్లో మద్యం అక్రమంగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
ఇవీ చూడండి...