ఇవి చూడండి.....
తండ్రి విజయం కోసం 'పల్లె' పల్లెకు తనయుడు - puttaparti
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని పల్లె రఘునాథ్ రెడ్డి తనయుడు అభిప్రాయపడ్డారు. పుట్టపర్తిలో మరోసారి తెలుగుదేశం విజయం సాధించాలని కోరుతూ... గ్రామాల్లో ఆయన పర్యటిస్తున్నారు.
తెదెపాకు మరోసారి అవకాశం ఇవ్వండి
అనంతపురం జిల్లాలో పుట్టపర్తి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పల్లె రఘునాథ్ రెడ్డి కుమారుడు కృష్ణకిశోర్ రెడ్డి ప్రచారం చేశారు. తెదేపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి వివరించారు. నియోజకవర్గంలో తెదేపాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని... ఎన్నికల్లో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన తెదేపాకు మళ్లీ అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు.
ఇవి చూడండి.....
sample description