కర్నూలు జిల్లా గురుజాలలో తుంగభద్ర పుష్కరాల సందర్భంగా భక్తుల రాక పెరిగింది. నివర్ తుపాను నేపథ్యంలో వ్యవసాయ పనులు లేనందున సమీప ప్రాంతాల్లో భక్తులు పుష్కర స్నానాలు చేస్తున్నారు. ఘాట్ల వద్ద రద్దీ పెరిగింది. నదిలో పుష్కర స్నానం చేసి ఒడ్డున ఉన్న శ్రీరామలింగేశ్వరస్వామిని దర్శించుకొని పూజలు చేస్తున్నారు.
కర్నూలులో..
తుంగభద్ర నది పుష్కరాల కర్నూలులో భక్తి శ్రద్దలతో కొనసాగుతున్నాయి. కర్నూలు నగరంలోని సంకల్ బాగ్ పుష్కర ఘాట్ లో జిల్లా అడిషనల్ ఎస్పీ ఎల్.అర్జున్ ఆధ్వర్యంలో వృద్ధులతో పుష్కర పూజా కార్యక్రమాలు చేయించారు. పుష్కర ఘాట్ లోని యాగశాలలో జరుగుతున్న హోమం చుట్టూ ప్రదక్షిణ చేయించి వేదపండితులచే ఆశీర్వచనం అందుకున్నారు.
ఇదీ చదవండి:
నివర్ ప్రభావం... పుష్కరాలు కళావిహీనం