పాటిల్ హేమంత్‌రెడ్డిది వ్యవసాయ కుటుంబం. కర్నూలు మొదటి జడ్పీ ఛైర్మన్‌గా పని చేశారు. ఆలూరు నియోజకవర్గంలో ఏకైక ఏకగ్రీవ ఎమ్మెల్యే మొలగవల్లి లక్ష్మీకాంత్‌రెడ్డితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అప్పట్లో గ్రామాభివృద్ధికి ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు తక్కువగా ఉండేవి. ఇంటి పన్నులు కట్టించుకోవాలాంటే పెద్దరికం అడ్డు వస్తుండటంతో పన్నులన్నీ సర్పంచే కట్టాల్సిన రోజులవి. ప్రజల బాగోగుల కోసం వారే కట్టారు. గ్రామంలో ఉత్సవం జరిగినా, పెళ్లి జరిగినా గ్రామానికి అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చినా చేతి నుంచి ఖర్చు చేసి పదవికే వన్నె తెచ్చారు. ఆ రోజుల్లోనే చేతి నుంచి ఎంత తక్కువ అనుకున్నా.... రూ.లక్ష వరకు ఖర్చు చేసేవారు.
గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే, ఎంపీ, జడ్పీ ఛైర్మన్‌తో మాట్లాడి నిధులు తెచ్చి రోడ్డు, తాగునీటి ట్యాంకులు నిర్మించారు. ఇప్పుడు గ్రామ పంచాయతీలకు నిధుల గలగలాడుతున్నాయి. అందుకే ఆ పదవికి చాలా మంది పోటీ పడుతున్నారు. ఎన్నికల్లో ఎలాగైన గెలువాలని రూ.లక్షలు ఖర్చు పెడుతున్నారు. మద్యం, డబ్బు, తాయిలాలు కొదవలేదు. దీనికి తోడు దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్నడుతున్నారు. ఇప్పుడు ఎన్నికలంటే ఖర్చుతో కూడిన పెట్టుబడిగా మారింది. హేమంతరెడ్డి కుటుంబం ప్రస్తుతం అనంతపురం జిల్లా, గుంతకల్లు పట్టణంలో ఉంటోంది. ఆయన కుమారులు కుళ్లు పట్టిన రాజకీయాలకు దూరంగా ఉండటం విశేషం.
ఇదీ చదవండి: