కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం చేపట్టారు. పోలీసులు 35 మంది పిల్లలకు పనుల నుంచి విముక్తి కల్పించారు. శిక్షణ ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ పోలీసు స్టేషన్ ఆవరణలో పిల్లలు, తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. పిల్లలను పనులకు పంపకుండా బడికి పంపాలని సూచించారు. పిల్లలను పనిలోకి పెట్టుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి:
పోలవరానికి కేంద్రం నిధులివ్వకుంటే బాధ్యత మేమే తీసుకుంటాం: మంత్రి బొత్స