రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని కొనసాగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్రంలోనే తెలుగుతో పాటు ఇతర భాషల చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్య కుంటుపడుతోంది. కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలోని గూల్యం గ్రామం కన్నడ పాఠశాలలో 500 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. అయితే కేవలం ఇద్దరు ఉపాధ్యాయులే ఉండటం విద్యార్థులకు ఇబ్బందిగా మారింది.
ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక్కొక్క తరగతిలో 100 మంది విద్యార్థులకు పైగా చదువుతున్నారు. వీరందరికీ తగిన స్థాయిలో భోదించలేకపోతున్నామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పాఠం చెప్తుంటే మరోవైపు విద్యార్థులు అల్లరి చేస్తున్నారని.. వారిని అదుపు చేయలేక తిప్పలు పడుతున్నామంటున్నారు.
ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థులు ఉన్న పాఠశాలకు ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమిస్తే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని ఉపాధ్యాయులు అంటున్నారు.
ఇదీ చూడండి