కర్నూలులో ఈ సీజన్లో రికార్డు స్థాయిలో ఉల్లి ధర పలికింది. క్వింటా ఉల్లి 3వేల 310 రూపాయలకు చేరింది. మంగళవారం మొత్తం 6వేల 489 క్వింటాళ్ల పంట మార్కెట్కు వచ్చింది. నాణ్యమైన ఉల్లికి 3 వేల రూపాయలకుపైగా ధర పలకగా.. కనిష్ఠ ధర 16వందల20 రూపాయలుగా ఉంది. సరాసరిగా 2వేల 830 రూపాయల ధర పలుకుతుండటంతో... రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి.