శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,31,717,.. ఔట్‌ఫ్లో 1,21,719 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా..ప్రస్తుతం నీటిమట్టం 884.80 అడుగులకు చేరుకుంది.
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ 214.3637 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.
ఇదీ చదవండి