రాష్ట్రంలో వయోవృద్ధుల పరిస్థితి దయనీయంగా మారింది. కర్నూలు జిల్లాలో వయోవృద్ధులు కలెక్టర్ కార్యాలయం ఎదుట తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. నేడు వయోవృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం సందర్భంగా.. తమ సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఇస్తున్న కాస్త పింఛనూ.. పిల్లలు తీసుకుని తమపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
నా పిల్లలను ఎంతో కష్టపడి చదివించాను. ఉద్యోగం వచ్చేదాకా నాన్నా..నాన్నా..అని నావెంటే ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగం , పెళ్లి, పిల్లలు వచ్చేసరికి నా పాటికి నన్ను వదిలేశారు. నాకు ప్రభుత్వం ఇచ్చే కాస్త పింఛను కూడా నాకు దక్కనివ్వడం లేదు. - ఓవృద్ధుడి ఆవేదన
ఇదీ చదవండి: పాక్లో భారత 'హైకమిషన్' అధికారులు అదృశ్యం